జీ తెలుగు సొంతం చేసుకున్న ‘ఓకే బంగారం’

Ok-Bangaram
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు చెప్పగానే మన మదిలో కొన్ని అద్భుతమైన సినిమాలు మెదిలే దర్శకులలో మణిరత్నం ముందుంటారు. ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన మణిరత్నం ఈ ఏడాది ‘ఓకే బంగారం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. చాలా కాలం తర్వాత మణిరత్నం కి హిట్ ఇచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వడమే కాకుండా మంచి విజయాన్ని కూడా అందుకుంది. తెలుగులో దిల్ రాజు ఈ సినిమాని రిలీజ్ చేసారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. హిట్ సినిమా కావడంతో ఫాన్సీ రేటుకే ఓకే బంగారం శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

Exit mobile version