సెట్స్ లో సుకుమార్ ని థ్రిల్ చేస్తున్న ఎన్.టి.ఆర్

ntr-sukumar
టాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ కోసం నటీనటులకి చుక్కలు చూపించే దర్శకులలో డిఫరెంట్ ఫిల్మ్స్ తీసే సుకుమార్ కూడా ఒకరు. సెట్స్ లో తను అనుకున్నది అనుకున్నట్టుగా రావడం కోసం సుకుమార్ ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటాడు. అలాంటి సుకుమార్ ని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన టాలెంట్ తో థ్రిల్ చేస్తున్నాడు. ప్రస్తుతం లండన్ లోని ఈ చిత్ర టీం నుంచి మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ తన పెర్ఫార్మన్స్ తో సెట్స్ లో అందరినీ థ్రిల్ చేస్తున్నాడట, ముఖ్యంగా సుకుమార్ ని.. ఎన్.టి.ఆర్ తనకిచ్చిన ప్రతి సీన్ లోనూ అనుకున్నదానికంటే బెస్ట్ ఇస్తున్నాడట..

తను నమ్మిన పాత్ర కోసం ఎన్.టి.ఆర్ చూపిస్తున్న డెడికేషన్ మరియు ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయి మిస్టర్ పర్ఫెక్ట్ గా నటిస్తుండడం చూసి సుకుమార్ థ్రిల్ అవుతున్నాడట.. అది కూడా రీటేక్స్ లేకుండా ఒకటి లేదా రెండు మూడు టేక్స్ లోనే సీన్ ఓకే అయ్యేలా నటిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడట. ఎక్కువ రీటేక్స్ తీసుకోకపోవడం వలన సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా పూర్తవుతోందని ఈ చిత్ర టీం తెలిపింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్ సింగ్ – రాజేంద్ర ప్రసాద్ లపై వచ్చే ఓ కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో టోటల్ గా మునుపెన్నడూ కనపడని ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే తన ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమా కోసం ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

Exit mobile version