అర్పిత క్రియేషన్స్ పతాకంపై కిరణ్ పత్తికొండ నిర్మాణంలో రూపొందుతోన్న హర్రర్ సినిమా ‘కాకి’. అశోక్ కుమార్, కిరణ్ పత్తికొండ, మేఘా శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మనోన్.యం. దర్శకత్వం వహించారు. కేవలం 45రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేసేలా నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేస్తూ నిర్మాత ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘కాకి’ సినిమా షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లోనే పకడ్బందీగా పూర్తి చేశామని, 10రోజుల పాటు డే అండ్ నైట్ షూటింగ్‌ను కూడా టీమ్ ఎంజాయ్ చేస్తూ చేసిందని తెలిపారు. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డీఐ పనులు జరుగుతున్నాయని, అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని దర్శక నిర్మాతలు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక పూర్తి హర్రర్ డ్రామాగా తెరకెక్కిన ‘కాకి’ సినిమా 2 గంటల 10 నిమిషాల నిడివితో ఒకే ఒక్క పాటతో, ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
