ఎన్టీఆర్ బయోపిక్ రేపు ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా లో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ప్రముఖ కెమెరా మెన్ సంతోష్ తున్డిల్ సినిమాటోగ్రఫర్ గా పనిచెయ్యబోతున్నారు. గతంలో ఈ కెమెరా మెన్ హిందీలో ‘క్రిష్, రౌడి రాథోడ్, ఎంఎస్.ధోని, రుస్తం’ వంటి హిట్ సినిమాలకు పనిచెయ్యడం జరిగింది.
కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తుండగా ఎల్.శ్రీనాథ్ రచయితగా పనిచేస్తున్నారు. విష్ణు ఇందురి, సాయి కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా తారల పాత్రలు కూడ ఉండబోతున్నాయి. రేపు జరగబోయే ఈ సినిమా ఓపెనింగ్ కి రాష్ట్రం నలుమూలల నుండి ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనబోతున్నారు.
