ఆ హీరోయిన్ నాకెప్పుడూ ప్రత్యేకమే – అల్లు శిరీష్

Allu sirish1

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా, మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ తనయుడుగా కెరీర్ ను గ్రాండ్ గా మొదలు పెట్టిన అల్లు శిరీష్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరో వైపు స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. కాగా శిరీష్‌ మొదటి చిత్రం ‘గౌరవం’. ఆ చిత్రంలో శిరీష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది.

అయితే ముంబాయ్ వెళ్లిన శిరీష్‌ కి యామి గౌతమ్‌ కలిశారు. ఈ సందర్భంగా శిరీష్‌ యామి గౌతమ్‌ తో దిగిన సెల్ఫీ ని తన ట్విటర్‌ లో పోస్ట్‌ చేస్తూ.. ‘యామి గౌతమ్‌ ను ముంబయిలో కలిసాను. ఎంతైనా ఆమె నా ఫస్ట్ కో స్టార్ కదా.. అందుకే ఆమె నాకు ఎప్పుడూ ప్రత్యేకమే’ అని క్యాప్షన్‌ పెట్టారు.

Exit mobile version