‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈషా, బ్రాండ్ బాబు చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ప్రస్తుతం ఆమె యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేతలో, మరియు హీరో సుమంత్ చిత్రంలో కూడా నటిస్తోంది.
సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ తెలుగు హీరోయిన్ ఓ యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ రొమాన్స్ చేయబోతుంది. వివరాల్లోకి వెళ్తే ఓ కొత్త దర్శకుని దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా చేయబోతున్న ఓ కొత్త చిత్రంలో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించనుంది. పైసా వసూల్ నిర్మాత ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
