‘ముద్దుగారే యశోద’ బాగుంది – ప్రముఖ గాయని సునీత !

sunitha1

సమీర్ ,పవిత్ర లోకేష్ ,మధుమని ,శృతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ముద్దుగారే యశోద’ అనే వెబ్ సిరీస్ స్పెషల్ షో ని ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖుల కోసం ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో సింగర్ సునీత ,ఉత్తేజ్ ,బిత్తిరి సత్తి ,కళ్యాణి మల్లిక్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సంధర్బంగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ శ్రీ చైతూ ఇంతకుముందు నాతో రాగం అనే షార్ట్ ఫిలిం చేసింది నాకు చాలా ఇష్టమైన సినిమా అది ,ఇప్పుడు చాలా మంచి టైటిల్ తో “ముద్దుగారే యశోద” వెబ్ సిరీస్ చేసింది. నాకయితే సినిమా చూసినట్టే అనిపించి ,ఇందులో నటించిన పిల్లలు చాలా బాగా చేసారు అని అన్నారు. దర్శకురాలు శ్రీ చైతు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజ్ రాచూరి నిర్మించారు. కళ్యాణి మల్లిక్ సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version