బాలయ్య కొత్త ట్రెండ్.. ఫాలో అవ్వాల్సిందేనంటున్న చిరు ఫ్యాన్స్

Balakrishna Chiranjeevi

నందమూరి బాలకృష్ణ కొత్తగా చేస్తున్న ప్రయత్నం ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే ‘నర్తనశాల’ ఫుటేజ్ విడుదల. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందుకే అభిమానులకు కూడ ‘నర్తనశాల’ అంటే ఒక ప్రత్యేకమైన క్యూరియాసిటీ. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్య్ మొదలైన కొన్నిరోజులకే ఆగిపోవడంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు వాళ్ళను అలరించడానికి అప్పట్లో షూట్ చేసిన ఫుటేజ్ ను ఎడిట్ చేసి 17 నిముషాలకు కుదించి విజయదశమి రోజున విడుదలచేయనున్నారు.

బాలయ్య తీసుకొచ్చిన ఈ కొత్త ట్రెండ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్ని ఆకట్టుకోవడమే కాదు వారి మనసులో కూడ ఒక కోరిక పుట్టేలా చేసింది. గతంలో చిరు మొదలుపెట్టి ఆపేసిన సినిమాల్లో ‘అబు : బాగ్దాద్ గజదొంగ’ సినిమా ఒకటి. ‘బాషా’ ఫెమ్ సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. అప్పట్లోనే భారీ వ్యయంతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను కూడ తీసుకొచ్చారు. కానీ ఎందుకో కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాక చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఫుటేజును ‘నర్తనశాల’ తరహాలోనే ఎడిట్ చేసి విడుదల చేయమని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అభిమానుల కోరికతో చిరు ‘అబు’ ఫుటేజ్ బయటకు తీసే పనులు మొదలపెడతారేమో చూద్దాం.

Exit mobile version