“రామారావు ఆన్ డ్యూటీ” కోసం నాచురల్ స్టార్ నాని..!

rrot

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఆడియెన్స్ ఎదురు చూస్తున్న పలు ప్రముఖ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” కూడా ఒకటి. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ఎలిమెంట్స్ తో తెరకెక్కి ప్రామిసింగ్ హైప్ ని సెట్ చేసుకుంది. ఇక ఈ చిత్రంపై మేకర్స్ ఈరోజు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ ఈవెంట్ కి గాను స్పెషల్ గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని రాబోతున్నట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఈ ఇద్దరు హీరోలు ఆన్ స్టేజ్ పై ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు మరియు రవితేజ సినిమా బ్యానర్ లో ఈ చిత్రం నిర్మించబడి ఈ జూలై 29న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Exit mobile version