
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్ మరియు ఉపాసనలకు కొద్ది రోజుల క్రితం ఒక పాప పుట్టిన విషయం తెలిసిందే. అయితే ఉపాసన డిశ్చార్జ్ సమయంలో చరణ్ మీడియాతో మాట్లాడుతూ తమ పాప పేరును నామకరణ కార్యక్రమంలో ప్రకటిస్తామని తెలిపారు. ఇక నేడు తెల్లవారుఝామున జరిగిన పాప ఊయల వేడుకలో ఆమెకు నామకరణం చేసారు. కాగా తాతయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన చిన్న మనవరాలి పేరును కొద్దిసేపటి క్రితం ప్రజలకు వెల్లడించారు.
తన భార్య సురేఖ మరియు ఉపాసన తల్లిదండ్రులు అనిల్ కామినేని మరియు శోభనా కామినేనిలతో కలిసి ఊయలలో ఆడుకుంటున్న పాపతో ఉన్న పిక్ ని షేర్ చేసారు మెగాస్టార్. అలానే పాప పేరు క్లిన్ కారా కొణిదెల అని చిరు వెల్లడించారు. కాగా ఆ పేరు లలితా సహస్రనామ నామం నుండి తీసుకోబడింది. క్లిన్ కారా ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది. దివ్యమైన అమ్మవారి యొక్క అత్యున్నత శక్తిని ప్రతిబింబిస్తూ దానికి శక్తివంతమైన రింగ్ మరియు వైబ్రేషన్ ఉంది అని చిరు ట్వీట్ చేశారు.
అలానే లిటిల్ ప్రిన్సెస్ తన వ్యక్తిత్వంలో ఈ లక్షణాలను ఇమిడ్చుకుంటుందని మనమందరం ఖచ్చితంగా ఆశిద్దాము. ఆమె పెరిగేకొద్దీ అందరినీ మంత్రముగ్దులను చేస్తుందని నమ్ముతున్నాము అంటూ మెగాస్టార్ పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతుండగా. పలువురు ప్రేక్షకాభిమానులు బేబీ క్లిన్ కారా కొణిదెలకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
And the baby’s name is ‘Klin Kaara Konidela ‘..
Taken from the Lalitha Sahasranamam .. the name ‘Klin Kaara’ .. signifies a transformative purifying energy that brings about a spiritual awakening!
All of us are sure the little one, the Little Princess will imbibe these… pic.twitter.com/OKCf7Hw18z
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023