
మన టాలీవుడ్ ఫ్యామిలీ మ్యాన్ జగపతి బాబు ఇపుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో చిత్రాల్లో సాలిడ్ రోల్స్ తో అయితే తాను ఫుల్ బిజీ బిజీగా ఉండగా తాను సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టీవ్ గానే ఉంటారు. అయితే సినిమా అప్డేట్స్ ఎవరికైనా విషెస్ లాంటివి తన నుంచి చాలా రేర్ గా ఉంటాయి కానీ తన ఫాలోవర్స్ కి మాత్రం మంచి ఫన్ ని అందించడంలో జగపతి బాబు ముందు ఉంటారు.
అలా తాను ఎప్పటికప్పుడు తన మీద మంచి సర్కాస్టిక్ పోస్ట్ లు వేస్తూ నవ్వించే తాను ఇప్పుడు ఇంకో ఫన్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ తో తాగి బట్టలూడదీసి మరీ తందానాలు అంటే ఇదే అంటూ తాను తన ఫ్రెండ్ తో కలిసి షర్ట్ లు లేకుండా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తున్న పిక్ షేర్ చేసి మంచి ఫన్ రైజ్ చేశారు. దీనితో ఫాలోవర్స్ కూడా ఈ ఫన్ పోస్ట్ చూసి నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం అయితే జగపతిబాబు సలార్, గుంటూరు కారం లాంటి భారీ చిత్రాల్లో నటించారు.
https://twitter.com/IamJagguBhai/status/1698932893643579700?s=20