రెబల్ సాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్” (The Raja Saab). మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ హారర్ ఫాంటసీ సినిమాగా రాబోతుంది. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ట్రీట్ కి సంబంధించి మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నేడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ పైనే అందరి కళ్ళు పడ్డాయి.
నిజానికి ఈ ఈవెంట్ విషయం ఎలాంటివో హంగామా లేకుండా ముఖ్యంగా గ్యాప్ ఇవ్వకుండా అనౌన్స్ చేసేసారు. దీనితో ఇంత త్వరగా చేసేస్తున్ ఈవెంట్ ఎలా ప్లాన్ చేశారు అనేది ఒకింత సస్పెన్స్ గా మారింది. చాలా సింపుల్ గా చేసేస్తారా లేక సర్ప్రైజింగ్ గా కూడా ఏమన్నా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది. అంతే కాకుండా ప్రభాస్ నుంచి చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి ఒక ప్యాకేజ్ రోల్ వస్తుంది. సో ఈ సినిమాపై ప్రభాస్ ఏం మాట్లాడుతాడు అనేది కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
