వరల్డ్ వైడ్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ టార్గెట్ అంత మొత్తమా!?

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). ఈ సంక్రాంతి పండుగ కానుకగా అలరించేందుకు వస్తున్న ఈ సినిమా కోసం రిలీజ్ దగ్గరకి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో స్ట్రాంగ్ బుకింగ్స్ ని ఈ సినిమా చూపిస్తుంది.

ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గట్టి టార్గెట్ తోనే దిగబోతున్నట్టు ట్రేడ్ వర్గాల్లో లెక్కలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టాల్సి ఉందట. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా సుమారు 90 కోట్ల మేర ఆపైనే బిజినెస్ చేసినట్టు టాక్ ఉంది.

ఇలా ఓవరాల్ గా మన శంకర వరప్రసాద్ గారు గట్టెక్కాలంటే అంత మొత్తం అందుకోవాలట. సో ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఎలాంటి రీసౌండ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ జనవరి 12న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version