కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్'(Toxic). కోలీవుడ్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ హైప్ ని సెట్ చేసుకోగా ఈ సినిమా నుంచి ఒక గ్రాండ్ రివీల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీయఫ్ లాంటి సెన్సేషనల్ సక్సెస్ లు తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా అనే దానికి ఇప్పుడు యష్ అండ్ కో గట్టి సమాధానమే ఇచ్చేలా ఉన్నారని చెప్పాలి.
నేడు యష్ బర్త్ డే కానుకగా వదిలిన టీజర్ ఫ్యాన్స్ లో ఒక బ్లాస్ట్ గా కనిపిస్తుంది. గతంలో కేజీయఫ్ 2 టీజర్ తరహాలోనే కంప్లీట్ ఇంగ్లీష్ లోనే ప్లాన్ చేయడమే కాకుండా యష్ నుంచి షాకింగ్ బోల్డ్ సీన్స్ ఫ్యాన్స్ అండ్ పాన్ ఇండియా ఆడియెన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇక ఇందులో యాక్షన్ బ్లాక్ అండ్ టేకింగ్ అయితే కేజీయఫ్ స్టైల్ లోనే రాయాగా యష్ స్వాగ్ తో కంప్లీట్ గా డామినేట్ చేసేశాడని చెప్పవచ్చు.
వీటితో పాటుగా రవి బాసృర్ స్కోర్ కూడా హైలైట్ గా క్లిక్ అయ్యింది. ఇలా ఇదంతా చూస్తుంటే యష్ గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. మెయిన్ గా ఈ సినిమాతోనే రీసెంట్ బాలీవుడ్ సెన్సేషనల్ సక్సెస్ ధురంధర్ 2 తో క్లాష్ కోసం చాలా మంది డౌట్స్ పడ్డారు. కానీ ఇప్పుడు ఈ టీజర్ చూసాక మాత్రం ఆ బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండేలా ఉందని చెప్పక తప్పదు. సో మార్చ్ 19కి అంతా సిద్ధం కావాల్సిందే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
