ది రాజా సాబ్ ప్రీమియర్స్ : ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్ టెన్షన్..!

The Raja Saab

తెలంగాణలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) టికెట్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో అసహనం పెరుగుతోంది. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల అనుమతులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల కోసం చిత్ర బృందం వేచి చూస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో నైజాం ఏరియాలో ప్రీమియర్స్‌ను సాధారణ ధరలతో నిర్వహించాలా? లేక పూర్తిగా ప్రీమియర్స్‌ను రద్దు చేసి, రేపటి నుంచి రెగ్యులర్ షోల కోసం టికెట్ హైక్ జీఓ కోసం ఎదురు చూడాలా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. సమయం దగ్గర పడుతుండడంతో ఈ నిర్ణయం కీలకంగా మారింది.

ఈ ఆలస్యం అభిమానులను నిరాశకు గురి చేస్తుండగా, భారీ పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకు కూడా ఇది టెన్షన్ పీరియడ్‌గా మారింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సిందే.

Exit mobile version