‘బోర్డర్ 2’ వచ్చినా ‘ధురంధర్’ దూకుడు ఆగలేదు.. 900 కోట్లపై కన్ను!

Dhurandhar

ఇటీవల బాలీవుడ్ చిత్రం డెలివర్ చేసిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) అలాగే లేటెస్ట్ గా సన్నీ డియోల్ నటించిన ‘బోర్డర్ 2’ (Border 2) లు కూడా ఒకటి. బాలీవుడ్ సినిమా దగ్గర మాసివ్ నంబర్స్ ని నమోదు చేసిన ఈ సినిమాలలో ధురంధర్ 2 వచ్చి చాలా రోజులు అయ్యింది.

అయితే దీని వేడి తగ్గుతున్న సమయంలోనే బోర్డర్ వచ్చి రికార్డు వసూళ్లు రాబడుతుంది. ఇలా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర బోర్డర్ 2 టేకోవర్ చేసినప్పటికీ ధురంధర్ చిత్రానికి మాత్రం 1 కోటికి వసూళ్లు తగ్గడం లేదు. ఇలా బోర్డర్ 2 వచ్చినప్పటికీ ధురంధర్ 2 వసూళ్ల పరంగా నిలకడగా నిలుస్తూ 890.8 కోట్ల నెట్ మార్క్ ని అందుకున్నట్టు బాలీవుడ్ పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి.

సో ఇంకో 11 కోట్లు ఈ సినిమాకి రావడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు. దీనితో ధురంధర్ ఎలైట్ 900 కోట్ల క్లబ్ లోకి చేరనుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించగా నెక్స్ట్ మార్చ్ లో రానున్న ధురంధర్ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version