‘జైలర్ 2’లో బాలీవుడ్ కింగ్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం..?

Jailer2

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘జైలర్’ చిత్రంలో ఉన్న క్యామియో పాత్రలతో పాటు మరికొన్ని క్యామియో రోల్స్ ఈ సీక్వెల్ మూవీలో ఉండనున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

కాగా, ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యామియో పాత్రలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఈ క్యామియో పాత్రలో షారుఖ్, రజినీ మధ్య వచ్చే సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. అయితే, తొలుత ఈ పాత్రను నందమూరి బాలకృష్ణ చేస్తారనే వార్తలు వచ్చాయి.

కానీ, ఇప్పుడు షారుఖ్ ఈ పాత్రలో కనిపిస్తాడనే వార్తతో అభిమానుల్లో ఈ క్యామియో పై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి నిజంగానే ‘జైలర్-2’లో షారుఖ్ నటిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version