రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఓ అతిధి పాత్ర కనిపిస్తోందని.. ఈ పాత్రలో ఓ ప్రముఖ హీరో కనిపిస్తాడు అని రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు అనేది చూడాలి. ఐతే, ఈ పాత్ర కాసేపు మాత్రమే సినిమాలో కనిపిస్తోందట. కానీ కథకు చాలా కీలకం అని టాక్.
ఇక ‘డేవిడ్ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్ డాగ్’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ (కోలీవుడ్ మూవీ) హీరోయిన్ మరియా నటించబోతుంది.
