టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది యువ నటి నయన్ సారిక. ‘గం గం గణేశా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఆ తర్వాత వచ్చిన ‘క’, ‘ఆయ్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకుంది. ముఖ్యంగా ‘ఆయ్’ సినిమాలో ఆమె పల్లెటూరి అమ్మాయి గెటప్, సహజ నటనకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు.
ఇటీవల శ్రీవిష్ణు సరసన ‘విష్ణు విన్యాసం’ చిత్రంలో కూడా ఆమె నటించి మెప్పించింది. ప్రస్తుతం నిహారిక కొనిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ హారర్ కామెడీ ‘రాకాస’ చిత్రంలో నయన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రాగా, ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
నటన, అందంతో పాటు సరైన కథల ఎంపికతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది నయన్. ఇంటర్వ్యూలలో తెలుగు సంస్కృతి, గోదావరి మర్యాదలపై ఆమె చూపిస్తున్న ప్రేమతో ప్రేక్షకులకు ‘అచ్చమైన తెలుగమ్మాయి’లా మరింత దగ్గరైంది. ‘రాకాస’ కూడా హిట్టైతే టాలీవుడ్లో నయన్ సారిక స్థానం మరింత పదిలం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
