నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం అందరికీ తెలిసిందే. భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా కొత్త విడుదల తేదీ అఫీషియల్ అనౌన్సమెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా దాదాపు సెప్టెంబర్ 25 కే వస్తుంది అని ఖరారు అయ్యింది. కానీ ఇదే డేట్ తో తన దసరా బ్యూటీ కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రం ‘దోరొతి’ అనే సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. కోలీవుడ్ పాపులర్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, మాస్ట్రో ఇళయరాజా వంటి వారు ఈ సినిమాకి వర్క్ చేయడం గమనార్హం.
ఇప్పుడు ఈ సినిమా ప్యారదాజ్ డేట్ నే లాక్ చేసుకుంది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ తమిళ్ వెర్షన్ కి కన్ఫర్మ్ చేశారు. తెలుగులో కూడా డేట్ ఇస్తే నాని తోనే క్లాష్ కి కీర్తి సురేష్ రానుంది అని చెప్పాలి. పైగా ప్యారడైజ్ లో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ క్లాష్ ఉంటుందో లేదో చూడాలి.
