వరల్డ్ వైడ్ మాంచి ఓపెనింగ్స్ తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు లోనే లీడ్!

స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా ఈ ఏడాది అపుడే రెండోది థియేటర్స్ లోకి వచ్చి సెన్సేషన్ ను సెట్ చేస్తుంది. మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా సూర్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఆల్రెడీ భారీ బుకింగ్స్ ఈ సినిమాకి నమోదు అవుతుండగా వరల్డ్ వైడ్ ఈ సినిమాకి ఏకంగా 30 కోట్లకి పైగా గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇందులో ఇంట్రెస్టింగ్ గా మొదటి రోజు తెలుగు వెర్షన్ వసూళ్లే కొంచెం లీడ్ లో ఉన్నట్టు కూడా టాక్. సో ఇలా మొత్తానికి కరుప్పు తర్వాత సూర్య నుంచి ఈ ఏడాదిలో రెండో బిగ్గెస్ట్ హిట్ వచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు అలాగే మమితా బైజు హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version