‘ఆటోనగర్ సూర్య’ ఎప్పుడొచ్చినా హిట్ అవుతుంది – నాగ చైతన్య

‘ఆటోనగర్ సూర్య’ ఎప్పుడొచ్చినా హిట్ అవుతుంది – నాగ చైతన్య

Published on May 27, 2014 11:22 AM IST

nag-chaitanya
అక్కినేని నాగ చైతన్య నటించిన ‘మనం’ సినిమా గత శుక్రవారం విడుదలై సూపర్బ్ మౌత్ టాక్ తో విడుదలైన అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు ఎఎన్ఆర్, నాగార్జున కూడా ఈ సినిమాలో నటించారు. మనం సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా నాగ చైతన్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ ప్రెస్ మీట్ లో చాలా కాలంగా విడుదలకి నోచుకుండా పలు ఇబ్బందులు పడుతున్న ‘ఆటోనగర్ సూర్య’ గురించి నాగ చైతన్యని అడిగితే ‘ ఆటోనగర్ సూర్య కోసం డైరెక్టర్ దేవకట్టా, నటీనటులు, మిగిలిన అందరూ టెక్నీషియన్స్ వారి ప్రాణం పెట్టి పనిచేసారు. సినిమా విడుదల ఆలస్యం అవ్వడం భాదాకరమైన విషయం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. సినిమా ఎప్పుడు విడుదలైనా డౌట్ లేకుండా హిట్ అవ్వడం మాత్రం ఖాయం అని’ అన్నాడు.

నాగ చైతన్య నటిస్తున్న మరో సినిమా ‘ఒక లైలా కోసం’. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూలై చివర్లో లేదా ఆగష్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు