
త్రిష చాలా కాలం తర్వాత బాలకృష్ణ చిత్రం ద్వారా తెలుగులో తిరిగి నటించనుంది. జూన్ 2న లాంచ్ కానున్న ఈ చిత్రంలో బాలకృష్ణతో కలసి పనిచేయనున్నందుకు ఆనందంవ్యక్తం చేసింది.
“ఫైనల్ గా లెజెండ్ తో కలసి తెర పంచుకోనున్నందుకు చాలా ఆనందంగా వుంది” అని ట్వీట్ చేసింది. సమాచారం ప్రకారం బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి త్రిష పాత్ర ప్రాముఖ్యతని ఆమెకి తెలియచేసారు. దర్శకుడు సత్య దేవా కథ వినిపించారు.
ఈ చిత్రానికి ‘గాడ్సే’ అనే పేరు పరిశీలనలో వుంది. రుద్రపాటి రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలచనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

