
స్వర్గీయ నందమూరి తారకరామా రావు 91వ జయంతి సందర్బంగా ఈరోజు ఉదయం పలువురు నందమూరి కుటుంబ సభ్యులు నవరస నటససార్వబౌముడికి నివాళులర్పించడానికి ఎన్టీఅర్ ఘాట్ వద్ద చేరుకున్నారు. నివాళులర్పించడానికి ఘాట్ కు చేరుకున్న వారీలో మొదటి వాడు యంగ్ టైగర్ జూ.ఎన్టీఅర్. తెల్లవారుజామునే అక్కడికి చేరుక్కున్న ఎన్టీఅర్ తో పాటు తండ్రి హరికృష్ణ, సోదరుడు కళ్యాణ్ రామ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు స్వర్గీయ ఎన్టీఅర్ కు నివాళులర్పించారు.
ఇటివల జరిగిన ఎన్నికలలో గణ విజయం సాధించిన సందర్బంగా అధిక సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఅర్ ఘాట్ కు చేరుకోనున్నారు.

