
భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు దేశంలో రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయి. అయితే దీని ప్రభావం తెలుగు సినిమా ఇండస్ట్రీపై కూడా పడనుంది. అయితే దీనిపై తెలంగాణ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ, “తెలంగాణ సంస్కృతి మన సినిమాలలో కూడా ఉండాలి, మన సినిమాల ద్వారా దీనిని ప్రపంచానికి చాటి చెప్పాలి. రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండే పవర్ సినిమాకు ఉంది” అని అన్నారు.
చాలా మంది సినీ ప్రముఖులు ఇదే ఉదేశాన్ని వ్యక్తం చేశారు.

