
అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సూపర్బ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ఈ సినిమాకి సంబందించిన శాటిలైట్ రైట్స్ కూడా బంపర్ ప్రైజ్ కి అమ్ముడు పోయాయి. జెమిని వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సుమారు 7 కోట్లకి కొనుగోలు చేసారు.
చక్కని కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, శ్రియ శరణ్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

