
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నమాస్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమాని సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఫైనల్ డే షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చిన మహేష్ బాబు గత రెండు రోజులుగా కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్నాడు. కేవలం క్లైమాక్స్ పార్ట్ డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉంది. క్లైమాక్స్ పార్ట్ డబ్బింగ్ నిమహేష్ బాబు నేటితో పూర్తి చేయనున్నాడు.
సోనూ సూద్ కి డబ్బింగ్ చెబుతున్న రవిశంకర్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ పూర్తి చేసాడు. వీరితో పాటు కాకుండా మిగిలిన నటీనటుల డబ్బింగ్ ఇప్పటికే ముగిసింది. మరోవైపు తమన్ కూడా రీ రికార్డింగ్ పనులను చకచకా పూర్తి చేస్తున్నాడు. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న టైంకే పూర్వవుతున్నాయి. దాంతో ఈ సినిమా సెప్టెంబర్ 19న వచ్చి తీరుతుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ లో విడుదలైన పంచ్ డైలాగ్స్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

