భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని దసరా కానుకగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన నటీనటుల డబ్బింగ్ వర్క్ జరుగుతోంది.
అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


