
హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలను అందించారు. వీరి లిస్టులో తాజాగా ‘ఈగ’ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వచ్చి చేరారు.
సాయి కొర్రపాటి అందరిలా ఆర్ధికంగా సహాయం చేయకుండా.. అక్కడ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో బియ్యం కొని పంపారు. సాయి కొర్రపాటి అప్పటికప్పుడు నెల్లూరులో 100 టన్నుల భియ్యం ని కొనుగోలు చేసారు. దాన్ని 20 కేజీల బ్యాగుల్లో నింపి మొత్తం 50 వేల బస్తాలను వైజాగ్ కి పంపారు.
‘ఇది కేవలం మొదటి విడతే అని మలి విడతలో కూడా పలువురికి సహాయం అందించేలా చూస్తాను అన్నారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమి అవసరం ఉన్నా ఆ అవసరాన్ని తీర్చడానికి ముందు వరుసలో ఉంటానని’ సాయి కొర్రపాటి హామీ ఇచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాయి కొర్రపాటి తీసుకున్న నిర్ణయం అబినందించదగినది పలువురు అభిప్రాయపడుతున్నారు.
బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి
బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి
Published on Oct 15, 2014 7:00 PM IST
సంబంధిత సమాచారం
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ఓటీటీ సమీక్ష : గట్టా కుస్తీ 2 – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎన్టీఆర్.. కేవలం పుకార్లు మాత్రమే..?
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- పిక్ టాక్ : కియారాకు సిద్ధార్థ్ బర్త్ డే విషెస్.. ఐస్ క్రీమ్ దొంగ అయినా స్పెషలే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- ఈ ఒక్క విషయంలో మాత్రం ‘ఆదిపురుష్’ తర్వాతే ‘రామాయణ’
- ‘రామాయణ’ ట్రైలర్ లో బిగ్ మిస్..! ఇందుకే పక్కన పెట్టారా?
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!
- ఇండియాలో రికార్డ్ ఓపెనింగ్స్ తో స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా!

