
సందీప్ కిషన్ హీరోగా ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జోరు’. ఈ సినిమాలో సందీప్ సరసన ముగ్గురు హీరోయిన్లు రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మలు నటించారు. భీమ్స్ స్వరపరిచిన ‘జోరు’ ఆడియో ఇటివలే విడుదలయి శ్రోతలను అలరిస్తుంది. ఈ సినిమాను నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుంది. నవంబర్ 7న మా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాం. సెన్సార్ పూర్తయిన తర్వాత అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. హీరో సందీప్ కిషన్ తెలిపారు. అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

