విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ – ‘పూజ’

విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ – ‘పూజ’

Published on Oct 16, 2014 9:37 PM IST

Pooja
తమిళ యువ హీరో విశాల్, శృతి హాసన్ జంటగా నటించిన సినిమా ‘పూజ’. ‘సింగం’, ‘యముడు’ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,100ల థియేటర్లలో విడుదలవుతుంది. విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సినిమాదే కావడం విశేషం. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా ఒకే రోజు విడుదలవుతుంది.

విశాల్ స్వీయ నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. విశాల్ నిర్మించిన గత సినిమాలు విజయవంతం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే యువన్ శంకర్ రాజా అందించిన ఆడియో శ్రోతలకు చేరువైంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు