
అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం తీవ్రమైన పోటి ఏర్పడగా, 4 కోట్ల రూపాయల ఫ్యాన్సీ రేటు చెల్లించి జీ తెలుగు చేజిక్కించుకుంది.
ఈ సినిమాలో అల్లరి నరేష్ అమాయకుడి పాత్రలో నటించగా, అతని సోదరిగా బొమ్మాళి తరహా పాత్రలో కార్తీక నటించింది. నరేష్ అభినయం, డూప్ సహాయం లేకుండా కార్తీక చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతుంది.
ఇటివల విడుదలైన ఆడియోకు శ్రోతలను అలరిస్తుంది. శేఖర్ చంద్ర అద్బుతమైన సంగీతం అందించారు. ప్రోమోలు, ట్రైలర్ లు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని కలిగించాయి. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటించింది. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అమ్మిరాజు నిర్మాత.

