
గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చరణ్ తాను కార్ణటిక్ సంగీతం నేర్చుకున్నట్టు తెలిపాడు. అంతేకాక ‘నీలి రంగు చీరలోన’ పాటలో కొన్ని పల్లవులు సైతం పాడాడు. త్వరలో సినిమాలో పాటలు పాడే అవకాశం వున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే తారక్, రవితేజ, ధనుష్ వంటి హీరోలు తమ గళాన్ని అందించారు.
ప్రస్తుతం కోనా వెంకట్, గోపీ మోహన్ ల స్క్రిప్ట్ ని ఖరారు చేసాడు. ఈ కధను తెరకెక్కించే దర్శకుడికోసం అన్వేషణలో వున్నారు. సమాచారం ప్రకారం శ్రీవాస్ దర్శకుడి పేరు పరిగణంలోకి తీసుకున్నారట

