నవంబర్ నుంచి కొరటాల సెట్లో మహేష్ బాబు

నవంబర్ నుంచి కొరటాల సెట్లో మహేష్ బాబు

Published on Oct 26, 2014 11:32 AM IST

Mahesh_babu1
‘ఆగడు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా చాలా రోజుల క్రితమే లాంచనంగా ప్రారంభమైంది. మహేష్ బాబు లేకుండా కొరటాల శివ మిగతా నటీనటులపై కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు నవంబర్ 3 నుంచి కొరత శివ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ నెల 30 నుంచి ప్రారంభమైతే, నవంబర్ 3 నుంచి మహేష్ బాబు జాయిన్ అవుతాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఓ స్మాల్ హాలిడే బ్రేక్ లో ఉన్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది. 2015 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు