
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా వారు ఇచ్చే మొదటి విజయంపైనే తన భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్స్ కి ఇది బాగా వర్తిస్తుంది. ఒక సినిమాతో హిట్ కొడితే తన తదుపరి సినిమా చాన్స్ ఓ స్టార్ హీరో తో వచ్చే అవకాశం ఉంది.
గత శుక్రవారం రిలీజ్ అయిన తమిళ ‘కత్తి’ సినిమా సూపర్ హిట్ తో ఇలాంటి పరిస్థితులే మురుగదాస్ విషయంలో జరుగుతున్నాయి. గతంలో మురుగదాస్ కి కొన్ని ఫెయిల్యూర్ సినిమాలు వచ్చాయి. కానీ తను గత రెండు సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం టాలీవుడ్ లోని స్టార్ హీరోస్ మురుగదాస్ పై దృష్టి పెట్టారని, తనతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో మురుగదాస్ చిరంజీవితో ‘స్టాలిన్’ సినిమా చేసారు. మరి మన స్టార్ హీరోలతో ఎఆర్ మురుగదాస్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తారా అనేది చూడాలి.

