రాజమౌళి ఫాదర్ పై వచ్చిన రూమర్స్ ని కొట్టిపారేసిన శిల్పి శర్మ

రాజమౌళి ఫాదర్ పై వచ్చిన రూమర్స్ ని కొట్టిపారేసిన శిల్పి శర్మ

Published on Oct 27, 2014 4:16 PM IST

Shilpi-Sharma
ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక, రాజమౌళి తండ్రి, విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం తన సినిమాలో హీరోయిన్ గా నటించగలిగే ఒక బోల్డ్ స్టార్ కోసం వెతికేపనిలో పడ్డారు. ఆ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం నటి శిల్పి శర్మని విజయేంద్రప్రసాద్ ఎప్పుడూ కలవలేదని, అసలు అతనికి ఆమె ఎవరో తెలీదని తెలిపింది.

ఐతే ఈ విషయం పై స్పందించిన శిల్పి శర్మ “నేను విజయేంద్రప్రసాద్ గారిని ఒక పి.ఆర్.ఓ ద్వారా కలిసి స్టొరీ డిస్కస్ చేయడం జరిగింది. నేను ఇంకా ఆ సినిమాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు విజయేంద్రప్రసాద్ గారి మీద ఒక నటిగా గౌరవం ఉంది. కాని మీడియా లో ప్రచారం జరిగిన వార్తపై నేను సంతృప్తిగా లేను” అని పేర్కొంది.

శిల్పి శర్మ తెలుగులో మారుతీ టాకీస్ బ్యానర్ పై నిర్మించిన “గ్రీన్ సిగ్నల్” సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత కన్నడ లో ఆక్రమణ అనే 3డి చిత్రంలో నటించింది. ఇవే కాకుండా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించనుంది.

తాజా వార్తలు