కేరింతలలో, చక్కిలిగింతలలో మునుగుతున్న హీరో

కేరింతలలో, చక్కిలిగింతలలో మునుగుతున్న హీరో

Published on Nov 3, 2014 4:02 PM IST

Sumantha-Aswin
ఎమ్.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ‘తూనీగ తూనీగ’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత విడుదలైన ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరువుపించుకున్నాడు. ఇటీవలే మారుతి బ్రాండ్ ‘లవర్స్’తో మాస్ హిట్ కూడా కొట్టాడు.

అయితే నటుడిచేతిలో ప్రస్తుతం రెండు యూత్ ఫుల్ మూవీస్ వున్నాయి. ఒకటి వినాయకుడు తీసిన సాయికిరణ్ అడివి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సాగుతున్న ‘కేరింత’ సినిమా కాగా మరొకటి సుకుమార్ స్కూల్ వచ్చిన వేమారెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘చక్కిలిగింత’. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంతో రెహానా హీరోయిన్ గా పరిచయంకానుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధించి సుమంత్ అశ్విన్ టాలీవుడ్ లో మంచి ప్లేస్ సంపాదించాలని కోరుకుందాం.

తాజా వార్తలు