
మిల్కీ బ్యూటీ తమన్నాకి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. పలు బాషల్లో ఏకకాలంలో నటిస్తూ షూటింగ్ పనులలో బిజీగా వుంది. ఇక ప్రచారాల వ్యవహారానికి వస్తే ఇప్పటికే పలు కంపనీలను తన కొంగుకు కట్టుకున్న ఈ భామ చేతికి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
సమాచారం ప్రకారం ఈ దుస్తుల కంపనీ భారీ ధరకు ఈ అమ్మడిని ప్రచారకర్తగా పెట్టుకున్నారట. మహేష్ బాబు స్థానంలో ఇక నుండి ఈ భామ ప్రచారం చేయనుంది. తమన్నా రాజమౌళి తీస్తున్న బాహుబలి చిత్రంలో భాగమనే విషయం తెలిసినదే.

