
తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై హుదూద్ బాధితులను ఆదుకోవడానికి చేస్తున్న కార్యక్రమం ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’. ఈ 13 గంటల లైవ్ టెలీతాన్ ప్రోగ్రాం నవంబర్ 30న హైదరబాద్ లో జరగనుంది. రోజురోజుకీ ఈ ప్రోగ్రాంకి సంబందించిన కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లైవ్ గా పెర్ఫార్మన్స్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలియజేశాం.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ కమెడియన్స్ అంతా కలిసి ఈ ప్రోగ్రాం మొత్తంలో మనల్ని మధ్య మధ్యలో నవ్విస్తూ ఉండడానికి 15 స్కిట్స్ ని రెడీ చేస్తున్నారు. ఈ 15 స్కిట్స్ లో టాలీవుడ్ లోని అందరు కమెడియన్స్ మనకు కనిపిస్తారు. ఈ 15 స్కిట్స్ కి సంబందించిన స్క్రిప్ట్ ని జబర్దస్త్ టీం వారు సిద్దం చేస్తున్నారు. జబర్దస్త్ టీం అంతా మన తెలుగు కమెడియన్స్ తో కలిసి ఈ స్కిట్స్ ని పెర్ఫార్మ్ చేస్తారు.
మునుపెన్నడూ లేని విధంగా ఉదయం 9 నుంచి రాత్రి 10వరకూ జరిగే ఈ ప్రోగ్రాంని లైవ్ గా టీవీలో ప్రసారం చేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి సపోర్ట్ గా తమిళ చిత్ర పరిశ్రమలోని పముఖులు కూడా ఈ వేడుకకి రానున్నారు.

