భాగ్యనగరంలో అల్లు అర్జున్ మూవీ షూటింగ్

భాగ్యనగరంలో అల్లు అర్జున్ మూవీ షూటింగ్

Published on Nov 10, 2014 10:06 AM IST

allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జులాయి’. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉండే బిజీ బిజీ వీధుల్లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జులాయి చిత్ర నిర్మాత అయిన కె. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్ర, స్నేహ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు