ఈ నెల 13న గెడ్డం గ్యాంగ్ ఆడియో

ఈ నెల 13న గెడ్డం గ్యాంగ్ ఆడియో

Published on Nov 10, 2014 9:34 PM IST

gaddam-gang
రాజశేఖర్ నటించిన ‘గెడ్డం గ్యాంగ్’ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై వీక్షకులను ఆకట్టుకుంది. స్క్రిప్ట్ విషయంలో, వేషధారణ విషయంలో రాజశేఖర్ చేస్తున్న సరికొత్త ప్రయత్నమే ఈ గెడ్డం గ్యాంగ్ అని చెప్పాలి. ఈ సినిమా ఆడియో ఈ నెల 13న హైదరాబాద్ లో ఘనంగా విడుదలకానుంది

గెడ్డం గ్యాంగ్ సినిమా తమిళనాట సూపర్ హిట్ అయిన సోధు కవ్వం చిత్రానికి రీమేక్. అక్కడ విజయ్ సేతుపతి పాత్రను మన యాంగ్రీ యాంగ్ మ్యాన్ భర్తీ చేయనున్నాడు. డార్క్ కామెడీ జోనర్ లో విడుదల కానున్న మొదటి సినిమాగా సమాచారం. పి. సంతోష్ దర్శకుడు. రాజశేఖర్ సరసన షీనా నటిస్తుంది

తాజా వార్తలు