
‘స్వామి రా రా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న సినిమాకు ‘దొరకడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని దర్శకుడు ఖండించారు. ‘దొరకడు’ కాదు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘మాయగాడు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఈ టైటిల్ పై దర్శకుడు పెదవి విప్పలేదు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి.
చైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు.

