
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ గురువారంతో పూర్తయింది. ఈ విషయాన్నీ దర్శకుడు సోషల్ మీడియాలో వెల్లడించారు.
‘నిన్నటితో ‘బందిపోటు’ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సినిమా తెరకెక్కిన విధానం పట్ల చాలా సంతోషంగా & ఎగ్జైటింగ్ గా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యేవరకు వెయిట్ చేయాలని నా మనసు కోరుకోవడం లేదు. చీర్స్ టు వండర్ ఫుల్ కాస్ట్ & క్రూ’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి పేస్ బుక్ లో పేర్కొన్నారు.
త్వరలో మిగిలిన రెండు సాంగ్స్ షూటింగ్ కోసం ఇటలీ, స్పెయిన్ వెళ్లనున్నారు. నవంబర్ 24తో షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. నరేష్ సరసన ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


