కేరళలో మహేష్ బాబు సినిమాకు ఫుల్ క్రేజ్

కేరళలో మహేష్ బాబు సినిమాకు ఫుల్ క్రేజ్

Published on Feb 1, 2015 4:08 PM IST

mahesh-babu

తెలుగు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా తన ఇమేజ్ ని పెంచు కుంటూ పోతున్నాడు. తను బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన ‘థమ్స్ అప్’ తో నార్త్ ఇండియాలో మహేష్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రసతుతం మహేష్ బాబు సౌత్ లో కూడా తన బౌన్దరీస్ ని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘1 నేనొక్కడినే’ కేరళలో దూసుకుపోతోంది. మహేష్ 1 నేనొక్కడినే సినిమాని 1 ఒరుత్తం అనే పేరుతో మలయాళంలో రిలీజ్ చేసారు.

ఈ సినిమా బిజినెస్ కి మంచి క్రేజ్ రావడమే కాకుండా అన్ని కేరళలోని అన్ని ప్రాంతాల్లోనూ సూపర్బ్ బిజినెస్ జరిగిపోయింది. బాగా పేరున్న పల్లవి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా మలయాళ వెర్షన్ ని రిలీజ్ చేసారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు.మామూలుగా థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ఆదరించే మలయాళ ఫ్యాన్స్ కి ఈ సినిమాలోనిత్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా నచ్చాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్ ల తర్వాత మహేష్ బాబు కూడా కేరళలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు