
‘జులాయి’ లాంటి హిట్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాకి ‘సన్ అఫ్ సత్యమూర్తి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమాలోని క్లైమాక్స్ పార్ట్ కి సంబందించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. హైదరబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం రెండు పాటల షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు.
మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఫిబ్రవరి రెండవ వారంలో సాంగ్స్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. అక్కడ ఇప్పటివరకూ చూపించని లోకేషన్స్ లో ఈ పాటలని షూట్ చేసేలా ప్రొడక్షన్ టీం ప్లాన్ చేసింది. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, స్నేహ పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక – హాసిన క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈమూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

