హర్రర్ సినిమా చేయనున్న త్రిష

హర్రర్ సినిమా చేయనున్న త్రిష

Published on Mar 21, 2015 2:05 PM IST

trisha
దశాబ్ద కాలంగా సౌత్ ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న అందాల భామ త్రిష. త్రిష తెలుగు, తమిళ, కన్నా భాషలలోని స్టార్ హీరోలందరితో నటించడమే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కూడా తెలుగులో బాలకృష్ణ సరసన ‘లయన్’ సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో ఓ రెండు సినిమాలు, కన్నడలో ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే త్రిష నిశ్చితార్దం జరిగింది. ఈ నిశ్చితార్ధంతో త్రిష ఇంకా సినిమాలు చేయరు అని అందరూ అనుకున్నారు. కానీ త్రిష మాత్రం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ వెళుతోంది.

తాజాగా త్రిష ఓ ద్విభాషా హర్రర్ చిత్రానికి సైన్ చేసింది. తెలుగులో ‘లవ్ యు బంగారం’ అనే సినిమా చేసిన గోపి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ఒకేసారి తమిళ మరియు కన్నడ భాషల్లో షూట్ చేయనున్నారు. నాగశౌర్యతో ‘లక్ష్మీరావే మా ఇంటికి’ సినిమా తీసిన మామిడిపల్లి గిరిధర్ ఈ సినిమాని ప్రతుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలు కానుంది.

తాజా వార్తలు