
‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మార్చి మొదట్లో ప్రారంభమయ్యి, ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో రవితేజ, తమన్నాలపై కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు. ప్రస్తుతం సంపత్ నంది, అతని టీం సెకండ్ షెడ్యూల్ కి కావలన్సిన అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ మూవీలో రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా ఆడిపాడనున్నారు. వీరిద్దరూ మొదటిసారి రవితేజతో జోడి కడుతున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్దం చేశారని యూనిట్ వర్గాల సమాచారం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

