
సినిమా సినిమాకి ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ ఒక్క తెలుగులోనే కాకుండా కుదిరినప్పుడల్లా తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సందీప్ కిషన్ మరో తమిళ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో కంటిన్యూగా జరుగుతోంది. తమిళ్ స్టార్ హీరోస్ సూర్య, కార్తీల బ్రదర్ ప్రభు నిర్మాతగా వ్యవహరిస్తున్న బ్యానర్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో రానున్న ఈ సినిమా ద్వారా షార్ట్ ఫిల్మ్ మేకర్ లోకేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో సందీప్ కిషన్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ కిషన్ – రెజీన కాంబినేషన్ లో వచ్చిన రొటీన్ లవ్ స్టొరీ, రారా కృష్ణయ్య సినిమాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. డార్క్ క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం నైట్ ఎఫెక్ట్ లోనే ఉంటుంది. ప్రస్తుతం సందీప్ కిషన్ నైట్ అంతా షూటింగ్ చేసి డే టైంలో రెస్త్ తీసుకుంటున్నాడు. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్న ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఇది పక్కన పెడితే సందీప్ కిషన్ నటించిన ‘టైగర్’ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. కాశీ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ లు ముఖ్య పాత్రలు పోషించారు.

