చిరంజీవి చేస్తేనే ఆ రెడ్డి గురించి తెలుస్తాడట.!

చిరంజీవి చేస్తేనే ఆ రెడ్డి గురించి తెలుస్తాడట.!

Published on Mar 26, 2015 12:03 AM IST

chiranjeevi
మెగా స్టార్ చిరంజీవి సినిమాలకి దూరమై చాలా రోజులైంది కానీ చిరు సినిమాలకి స్వస్తి చెప్పిన రోజు నుంచి ఈ రోజుటి వరకూ మెగాస్టార్ గా తనకున్న క్రేజ్ తగ్గలేదు. అలాగే ఆయన 150వ సినిమాపై ఉన్న ఆసక్తి కూడా తగ్గలేదు. చాలా రోజుల నుంచి మెగా అభిమానులను ఊరిస్తున్న 150వ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఎవరు చేస్తారు.? ఎప్పుడు మొదలవుతుంది.? ఎవరి కథని ఓకే చేస్తారు.? అనే విషయాలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కానీ ఈ సంవత్సరం ఈ సినిమాని స్టార్ చెయ్యాలనే ఆలోచనలో మాత్రం చిరు ఉన్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే పరుచూరి బ్రదర్స్ మాత్రం చిరు తన 150వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమానే చెయ్యాలని కోరుతున్నారు. తాజాగా పరుచూరి వెంకటేశ్వరరావు చిరంజీవి మాత్రమే నరసింహారెడ్డిగా చేయగలడని అంటున్నాడు. ‘శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటారో సీనియర్ ఎన్.టి.ఆర్ వేషం వేస్తె మనకు తెలిసింది, భక్త కన్నప్ప ఎలా ఉంటాడో కృష్ణంరాజు వేషం వేస్తె తెలిసింది. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడో సూపర్ స్టార్ కృష్ణ వేషం వేస్తే తెలిసింది. అలాగే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎలా ఉంటాడనేది చిరంజీవి గారు చేస్తేనే తెలుస్తుందని’ పరుచూరి వెంకటేశ్వరరావు అన్నాడు.

మరి చిరంజీవి పరుచూరి బ్రదర్స్ కోరికని మన్నించి ఈ సినిమాని టేకాఫ్ చేస్తాడా లేక వేరే ఏదైనా సినిమాపై ఆసక్తి చూపుతాడా అన్నది తెలియాల్సి ఉంది. చిరంజీవి 150వ సినిమాని రామ్ చరణ్ నిర్మించనున్నాడు

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు