బాహుబలి తమిళ రైట్స్ అంత రేటు పలికాయా.!

బాహుబలి తమిళ రైట్స్ అంత రేటు పలికాయా.!

Published on Mar 26, 2015 3:52 PM IST

Baahubali
తెలుగు చలన చిత్ర పరిశ్రమ రేంజ్ ని మరింత పెంచే దిశగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’. అంత్యంత భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని మే లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తమిళ రైట్స్ ని టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అయిన యువి క్రియేషన్స్ వారు భారీ ప్రైజ్ కి కొనుక్కున్నారు అని ఇది వరకే తెలియజేశాం. తాజాగా వాళ్ళు ఎంత అమౌంట్ కి ఈ రైట్స్ ని దక్కించుకున్నారు అనేది మీకు తెలియజేయనున్నాం. పలు తెలుగు, తమిళ ప్రొడక్షన్ సంస్థల మధ్య జరిగిన గట్టి పోటీలో యువి క్రియేషన్స్ వారు సుమారు 36 కోట్లకి తమిళ్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకి తమిళంలో ఈ రేంజ్ రేటు పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి హీరోలుగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు